
నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో స్థానిక మారుతి నగర్ లోని దివ్యాంగుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు హాజరై మాట్లాడుతూ సర్ సివి రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ వలన ఆయన నోబుల్ బహుమతి పొందాలని తెలిపారు. భారతదేశంలోని శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలను భారతదేశ ప్రజల ఉపయోగార్థం చేపట్టినట్లయితే భారతదేశానికి మేలు కలుగుతుందని భారతదేశం సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుతదని రామన్ భావించి ఆ విధంగా ఆవిష్కరణలు చేపట్టి నోబుల్ బహుమతి పొందారని తెలిపారు. ఈరోజు దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగులు సైన్సు ప్రాజెక్టులను చేపట్టి వివిధ అంశాలలో ప్రయోగాత్మకంగా వివరించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా అంద విద్యార్థులు చేపట్టిన నీటి శుద్ధికరణ ప్రయోగము, విత్తనాలు మొలకైతే విధానం యొక్క ప్రయోగం, గ్రహణాలు ఏర్పడే విధానము, గాలి ద్వారా విద్యుత్తును తయారు చేసుకునే విధానం అదేవిధంగా వారు వివరించిన విధానం చాలా అభినందనీయమని తెలిపారు. రాబోయే కాలంలో అంద విద్యార్థులు సిబ్బంది మరిన్ని ప్రయోగాలు చేపట్టి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వీరందరూ అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడవడం అభినందనీయమని పేర్కొన్నారు. తనకు సమాజసేవ అంటే చాలా మక్కువ అని స్నేహ సోసైటీ నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలు తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఈ విధంగా కృషి చేస్తున్న స్నేహ సొసైటీ యజమాన్యానికి సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు. స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గౌరవ అతిథిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి రసూల్ బి మాట్లాడుతూ తన 35 సంవత్సరాల క్యారీర్ లో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలలో ఎన్నో దివ్యంగుల పాఠశాలలు సందర్శించానని స్నేహ సొసైటీ దివ్యంగుల పాఠశాల విద్యార్థులు చేసిన సైన్సు ప్రయోగాలు ఎక్కడ చూడలేనని తెలిపారు. స్నేహ సొసైటీలో అంద విద్యార్థులు సైన్సు ప్రయోగాలు చేయడం చూసే భాగ్యం తమకు దక్కిందని అన్నారు. 100 విద్యార్థులు సైన్స్ ప్రయోగాలు చేయడమే కాకుండా వాటి గురించి వివరించడం నిజంగా అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వం ద్వారా దివ్యాంగులకు అందవలసిన పథకాలను అందచేస్తానని తెలిపారు. అందవిద్యార్థులు భవిష్యత్తులో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాశించారు. కార్యక్రమానికి మరో గౌరవ అతిథిగా జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞానాన్ని సాంకేతికతను నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే జాతీయ సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశమని సివి రామన్ చేసిన ప్రయోగాలను ఉపయోగించుకొని కొత్త ప్రయోగాలను చేయాలని సూచించారు. జాతీయ అవార్డు మహిళా విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు నర్ర రామారావు రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత డి. విజయానందరావు జాతీయ సైన్స్ దినోత్సవం ప్రాధాన్యతను తెలిపారు. అంద పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. సందర్భంగా అంద విద్యార్థులు తయారుచేసిన సైన్సు ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ ప్రయోగాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి యస్. సిద్దయ్య స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ యస్ జ్యోతి వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.