ప్రతి విద్యార్థి కి మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుందని, ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ ఆరతి మాట్లాడుతూ క్రీడలు అంటే నాకు చాలా ఇష్టమని స్టేట్ లెవల్ లో బాస్కెట్బాల్, అథ్లెటిక్స్ లో రాణించగలిగానని, అందువల్ల క్రీడాకారులు అంటే నాకు అపారమైన గౌరవమన్నారు. యూనివర్సిటీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ బి బాలకిషన్ మాట్లాడుతూ జాతీయ క్రీడ దినోత్సవ సందర్భంగా మేజర్ ధన్య చంద్ జీవిత చరిత్రను, క్రీడా చరిత్రను వివరిస్తూ విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని, భావితరాలు పౌరులుగా ఫీవర్ అందించాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంస పత్రాలను రిజిస్ట్రార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ డాక్టర్ మహేందర్ డాక్టర్ బి.ఆర్ నేత, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం..
నవతెలంగాణ డిచ్ పల్లి
జాతీయ క్రీడా దినోత్సవం మేజర్ ధన్యచంద్ జయంతి ని తెలంగాణ యూనివర్సిటీ లో మంగళవారం యూనివర్సిటీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి పాల్గోని మాట్లాడుతూ విద్యార్థులకు ముందుగా జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ప్రతి విద్యార్థి శారీరకంగా దారుఢ్యం పెంచుకోవాలని, కావలసిన వసతులను యూనివర్సిటీ తరఫున అందజేస్తామని ప్రతి ఒక్కరిలో ఆటుపోట్లు ఉంటాయని ఏ ఒక్క విద్యార్థులు అధర్యపడోద్దని క్రీడల వల్ల మానసిక వికాసం చెందుతుందని ఓటమి గెలుపుకు నాంది అని, దానికి ఉదాహరణ చంద్రయాన్ 2 విఫలం చెందడం దాని నుండి గుణపాఠం నేర్చుకొని చంద్రయాన్ 3 ప్రపంచం మెచ్చుకోదగ్గ భారతదేశంలో నిలిచిందని దానిని దృష్టిలో ప్రతి ఒక్క విద్యార్థులు ఉంచుకోని ముందడుగు వేయాలని సూచించారు.