సచివాలయంలో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం

–  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి ఆదివారం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమాచార శాఖ కార్యాలయంలో…
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో స్పెషల్‌ కమిషనర్‌ అశోక్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ అనిల్‌ కూర్మాచలం, సమాచార శాఖ డైరెక్టర్‌ రాజమౌళి, అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య కాంబ్లీ, జాయింట్‌ డైరెక్టర్‌ జగన్‌, డిప్యూటీ డైరెక్టర్లు మధుసూదన్‌, వెంకటేశ్వర్లు, ప్రసాద్‌తోపాటు పలువురు సీనియర్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love