ఘనంగా జాతీయ ఓటర్స్ దినోత్సవం..

National Voter's Dayనవతెలంగాణ – బజారత్నూర్
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్స్ దినోత్సవం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కళాశాల విద్యార్థులు అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఓటు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జ్ఞానేశ్వర్ షిండే, కళాశాల అధ్యాపకులు గంగాధర్, నవీన్ రెడ్డి, ప్రదీప్, అశోక్ రెడ్డి, వనజ, శ్రీనివాస్, భీమేష్, సుభాష్, రామారావు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love