
ప్రతి ఏడాది జనవరి 25న ఎన్నికల సంఘం ఆద్వర్యంలో నిర్వహించే 14 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెద్దవూర మండల కేంద్రంలో తహశీల్ధార్ సరోజ ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఓటు విలువ, ప్రాధాన్యత అంశాల నినాదాలతో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ ఎన్నికల కమీషన్ విడుదల చేసిన ఓటు ప్రాధాన్యత గీతాన్ని అందరూ ఆలపించారు. చివరిగా నిర్వహించిన ఓటు ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేసారు. అనంతరం విద్యార్దినిలకు ముగ్గుల పోటీ నిర్వహించి ప్రతిభ కనబర్చిన విద్యార్థినిలకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అజ్మీర రమేష్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి, ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి, ఎంఎస్ఓ సాలయ్య, రాజశేఖర్, కోట అంజి తదితరులు పాల్గొన్నారు.