మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈ నేల 16న దేశ వ్యాప్త కార్మిక సమ్మే

–  గ్రామీణ బంద్ నీ జయప్రదం చేయండి
– జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా సదస్సు పిలుపు
నవతెలంగాణ –  భువనగిరి
కేంద్ర బీజేపీ కార్పోరేట్, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16 న జరిగే దేశ వ్యాప్త కార్మిక సమ్మేను, గ్రామీణ బంద్ నీ జయప్రదం చేయాలని
జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ యాదాద్రి భువనగిరి జిల్లా సదస్సు కార్మికులకు పిలుపునిచ్చింది. మంగళవారం  జిల్లా కేంద్రంలోని స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో కార్మిక సంఘాల జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా సదస్సు జరిగింది.ఈ సదస్సులో ఐఎన్ టియుసి, ఎఐటి యుసి, సిఐ టియు, ఐఎఫ్ టియు, ఐఎఫ్ టియు, టీఎన్ టియుసి సంఘాల నాయకత్వం ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో పలు తీర్మానాలు చేయడం జరిగింది. ఫిబ్రవరి 16 న అన్ని కార్మిక, రైతు, వ్యవసాయ సంఘాలు, ప్రజాసంఘాలను కలుపుకొని గ్రామాలలో బంద్ నిర్వహించాలని, మండల కేంద్రాలలో భారీ ర్యాలీలు, ముట్టడిలు, రాస్తారోకోలు నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. ఆలేరు ఫిబ్రవరి 09, చౌటుప్పల్ ఫిబ్రవరి10, యాదగిరిగుట్ట ఫిబ్రవరి11న రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని సదస్సు నిర్ణయించారు.అన్ని మండలాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని సదస్స తీర్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఎన్ టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఎఐటి యుసి జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఇమ్రాన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, ఐఎఫ్ టియు రాష్ట్ర కార్యదర్శి జనార్ధన్, ఐఎఫ్ టియు జిల్లా కార్యదర్శి గడ్డం నాగరాజు, టిఎన్ టియుసి రాష్ట్ర నాయకులు రేగు బలనర్సింహ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సం..కావస్తున్నా రైతాంగ కార్మిక, ప్రజల సమస్యలు పరిష్కరించలేదన్నారు. భారత్ వెలిగి పోతూంది, అచ్చేదిన్ ఆయేగా, విశ్వ గూరూ, మేకిన్ ఇండియా అంటూ మోసపూరిత ఆకర్షణ నినాధాలు ఇచ్చింది తప్ప చేసింది ఏమి లేదన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న  29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులుగా తెచ్చిందని ఈ లేబర్ కోడలు కార్పొరేట్లకే ఉపయోగపడతాయని తెలియజేశారు.కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని సైతం మోడీ ప్రభుత్వం కాలరాస్తూ 12 గంటలు శ్రమదోపిడి చేసుకునేలా యజమాన్యాలకు అవకాశం కల్పిస్తూ లేబర్ కోడ్ లలో తీసుకువచ్చారని విమర్శించారు.
   కార్మికుల నిజవేతనాలు 20 శాతం తగ్గి పోయాయన్నారు. ఈ పరిస్థితుల్లో బిజేపి ప్రభుత్వం అవలంబించే కార్మిక,రైతాంగ,ప్రజా వ్యతిరేక విధానాలు మతతత్వ ధోరణులకు నిరసనగా దేశాన్ని రైతులను, కార్మికులను, ప్రజలను రక్షించడం కోసం ఫిబ్రవరి 16న జరుగుతున్న దేశ వ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్లో రైతులు, కార్మికులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలనీ పిలుపునిచ్చారు.  ఈ సదస్సుకు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షులు చంద్రన్నలు అద్యక్ష వర్గంగా వ్యవహరించడం జరిగింది. ఈ సదస్సులో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ , ఐ ఎన్ టి సి జిల్లా నాయకులు మురళి ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు  పిల్లి శంకర్, నాయకులు వెంకటేశ్, ఇంజ హేమలత, శోభన్, ఐ ఎఫ్ టి యు నాయకులు రామచంద్రం, సీఐటీయూ నాయకులు  ఎల్లన్న, గిరి, సంతోష్  పాల్గొన్నారు.
Spread the love