మద్దతు నిరాకరణపై దేశవ్యాప్త ఉద్యమం

20న చెరకు రైతుల ఆందోళన : ఎఐఎస్‌ఎఫ్‌ఎఫ్‌ పిలుపు
న్యూఢిల్లీ : చెరకుకు మద్దతుధర (ఎఫ్‌ఆర్‌పీ)ను 2023-24 సంవత్సరానికి క్వింటాల్‌కు కేవలం రూ.10 (టన్నుకు రూ.100) చొప్పున పెంచుతూ మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యను అఖిల భారత కిసాన్‌ సభ అనుబంధ సంస్థ అయిన అఖిల భారత చెరకు రైతుల సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్‌ఎఫ్‌) తీవ్రంగా ఖండించింది. రైతన్నలకు ముష్టి వేసినట్టు రూ.10 పెంచడమేంటని ప్రశ్నించింది. రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ఎఐఎస్‌ఎఫ్‌ఎఫ్‌ పిలుపునిచ్చింది. జులై 20వ తేదీన దేశవ్యాప్త నిరసన దినంగా పాటిస్తూ, చెరకు మిల్లుల ముందు , కేంద్ర ప్రభుత్వ కార్యాల యాల ఎదురుగా ఆందోళనలు చేపట్టాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చింది.
ప్రాథమికంగా 10.25 శాతం చక్కెర రికవరీ గల చెరకుకు గత ఐదేండ్లలో మద్దతు ధర క్వింటా ల్‌కు కేవలం రూ.40 మాత్రమే పెరిగి రూ.275 నుండి రూ.315కి చేరుకుందని పేర్కొంది. స్వామి నాథన్‌ ఫార్ములా సిటు ప్లస్‌ 50 శాతం ప్రాతిపదికగా 9.5 శాతం చక్కెర రికవరీ వద్ద క్వింటాల్‌కు కనీసం రూ.500 చొప్పున టన్నుకు రూ.5 వేలుగా, చెరకుకు ప్రోత్సాహక ధరను నిర్ణయించాలని రైతులు డిమాం డ్‌ చేస్తున్నారు. ఆకాశన్నంటేలా ఉపకరణాల ధరలు పెరిగిన కారణంగా ఉత్పత్తి వ్యయం కూడా పెరుగు తోందని, కానీ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసు కోలేదని చెరకు రైతుల సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు డి.రవీంద్రన్‌, ఎన్‌.కె.శుక్లా విమర్శించారు.
రాష్ట్రాల సిటు వ్యయ అంచనాల సగటు పరి గణనలోకి తీసుకుంటే దానికి 50శాతం కలిపితే క్వింటాల్‌కు రూ.438.75 అవుతోంది. కానీ ప్రభు త్వం ప్రకటించింది క్వింటాల్‌కు రూ.315 అంటే రైతు ఒక్కో క్వింటాల్‌కు రూ.123.5 మేర నష్టపోతు న్నారని వారు పేర్కొన్నారు.
కానీ ప్రభుత్వం క్వింటాల్‌కు సగటు ఎటు ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ వ్యయాన్ని ఉత్పత్తి వ్యయంగా పరిగణిం చిందని అన్నారు. ఇటువంటి మోసపూరితమైన, దారుణమైన లెక్కలు వేసి చూపిస్తూ ఉత్పత్తి వ్యయం కన్నా 50శాతం ఎక్కువ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. ప్రతి రాష్ట్రంలోనూ చెరకు రైతులు పెద్ద మొత్తంలో నష్టాల పాలవుతున్నారని ఆ ప్రకటనలో వారు పేర్కొన్నారు. చెరకునుండి చక్కెరను తయారుచేసే క్రమంలో వచ్చే ఉప ఉత్పత్తులపై వచ్చే లాభాల్లో కూడా తమకు వాటా ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా వందలాది చెరకు మిల్లు లు మూతపడ్డాయని, పైగా రైతులు చక్కెర మిల్లుల కు సరఫరా చేసిన చెరకుకు రావాల్సిన బకాయిలు పెద్ద మొత్తంలో వున్నాయని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో చెరకు రైతులు తీవ్ర దుస్థితులన ఎదుర్కొంటున్నారన్నారు.ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, చెరకు మద్దతు ధరను సవరించి, క్వింటాల్‌కు రూ.500 చొప్పున ఇవ్వాలని చెరకు రైతుల సమాఖ్య నేతలు డిమాండ్‌ చేశారు. ఉప ఉత్పత్తుల నుండి వచ్చే లాభాల్లో వాటా ఇవ్వాలని కోరింది. ఎరియర్లను వెంటన చెల్లించాలని, మూత పడిన మిల్లులను వెంటనే తెరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ, సహకార రంగాల్లోని చెరకు మిల్లులను ప్రయివేటీకరించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.

Spread the love