నాటు బాంబుల తయారీ ముఠా అరెస్ట్

Natu bomb making gang arrested– మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – కొనరావుపేట 
గత రెండు రోజాల కిందట కోనరావుపేట మండలం ధర్మారం గ్రామములో ఒక బర్రె నాటు బాంబుని ప్రమాదవశాత్తు కొరకగా.. ఆ బాంబు పేలి దాని కింది దవడ పగిలిపోయి చనిపోయింది. ఈ విషయములో ఆ చనిపోయిన బర్రె ఓనర్ అయిన ముడికే మల్లేశం ఫిర్యాదు చేశారు. BNS మరియు ఎక్స్ ప్లోజివ్ చట్టాల ప్రకారంగా ఏఎస్ఐ  రఘుపతి రెడ్డి కేసు నమోదు చేసి ధర్మారం గ్రామములో గతములో నాటు బాంబులు తయారు చేసి పట్టుబడిన పిట్టల రాజలింగం పై నిఘా పెట్టారు. ఈరోజు ఉదయం అతడు నాటు బాంబులు అమ్ముతున్నాడని పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏఎస్ఐ రఘుపతి రెడ్డి  సిబ్బందితో యుక్తముగా పిట్టల రాజలింగం ఇంటికి వెళ్ళి అతడు పడిగే లస్మయ్యకి నాటు బాంబులు  అమ్ముతుండగా పట్టుకున్నారు. వీరి ముగ్గురు వ్యక్తుల నేరము ఒప్పుకున్నారు. స్వాధీన పంచనామా నిర్వహించగ పిట్టల రాజలింగం తాను నాటు బాంబులు తయారు చేసి పడిగే లస్మయ్య, తుమ్మల కనకరాజు మరియు మొగిలి అంజయ్య r/o సర్దా పూర్ గ్రామం అనువారికి అమ్మారు. వారు ఆ నాటు బాంబులకు గొర్రె ప్రేగులు చుట్టి అడవి జంతువులకు ఎరగా వేయగా అట్టి నాటు బాంబుని  అడవి జంతువులు వచ్చి కొరకడంతో అది ఒక్కసారిగా ప్రేలాయి. దీంతో అడవి జంతువుల తల పగిలి అక్కడికక్కడే చనిపోయాయి. ఆ చనిపోయిన అడవి జంతువుని కోసి మాంసం అవసరం ఉన్న వారికి అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటామని తెలిపారు.
రాజలింగం వద్ద నుండి 1) 7 నాటు బాంబులను, 2) గన్ పౌడర్ తయారు చేయుటకు ఉపయోగించే రెండు పౌడర్ లు, 3) 2000 రూపాయలు, పడిగే లస్మయ్య వద్ద  10 నాటు బాంబులు, తుమ్మల కనకరాజు వద్ద  10 నాటు బాంబులు, స్వాదీనం చేసుకున్నారు. అధె విధంగా ఈరోజు ఉదయం సిరిసిల్లా పోలీసు వారు కూడా నమ్మదగిన సమాచారం మేరకు సర్దా పూర్ గ్రామంలోని మొగిలి అంజయ్య ఇంటి లో రైడ్ చేసి 40 నాటు బాంబులను స్వాదీనం చేసుకొని అతడిని విచారించగా అతడు అడవి జంతువులని వేటాడడానికి ధర్మారం గ్రామంలో నాటు బాంబుకి పిండి పెట్టి ఎరగా వెయ్యగా, దాన్ని బర్రె కొరకగా  ఆ బాంబు పేలి దాని కింది దవడ పగిలి చనిపోయిందని నేరము అంగీకరించగా అతడి వద్ద నుండి 40 నాటు బాంబులని స్వాదీనం చేసుకొని అతడిపై పలు చట్టాల ప్రకారంగా కేసు నమోదు చేయనయినది. పిట్టల రాజలింగం, పడిగే లస్మయ్య మరియు తుమ్మల కనకరాజు అనువారిపైబి బి.ఎన్.ఎస్ చట్టము, ఎక్స్ ప్లోజివ్స్ చట్టం మరియు వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారంగా  కోనరావుపేట. స్టేషన్లో లో కేసు నమోదు చేసి రిమాండ్ కు  తరలించనయినది.మరియు ఈ వేటగాళ్ళు ప్రజలకు వేరే మాంసం అమ్ముతు అది అడవి జంతువుల మాంసముగా నమ్మించి ప్రజలను మోసం చేస్తున్నారు, ఉదాహరణకు సీమ పంది మాంసం అమ్ముతు దానినే అడవి పంది మాంసం అని చెప్తుంటారు. చాకచక్యంగా వ్యవహరించి ముఠాను పట్టుకోవడంలో శ్రమించిన రుద్రంగి ఎస్ఐ అశోక్, కిరణ్ కుమార్ సిబ్బంది.   ఏ. ఎస్ ఐ రఘుపతి రెడ్డి , పోలీస్ కానిస్టేబుళ్లు  విశాల్ రాజు, రవి,సతీష్,అభిషేక్  ఓదెలు లను చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అభినందించారు.
Spread the love