ప్రజలకు, బాధితులకు అండగా నిలుస్తూ కృషి చేస్తున్న పత్రిక నవ తెలంగాణ దినపత్రిక అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. నవతెలంగాణ దినపత్రిక తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా పత్రికలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్లు పోలీసుల ఆఫీసర్ల పేరుతో ఫోన్ చేస్తే స్పందించవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ప్రజలను హెచ్చరించారు. ప్రస్తుతం ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు పోలీసు ఆఫీసర్ల పేరిట బెదిరింపులకు పాల్పడుతూ కొత్త విధానానికి తెరలేపారని అన్నారు. సైబర్ మోసాలపై స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల వలన ప్రజలు మోసపోతే 1930 నంబర్ కు వెంటనే ఫోన్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు.