ప్రజా సమస్యలు వేలికితీయడంలో నవ తెలంగాణ దిట్ట…

Bhupathi-reddy– నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి..
నవతెలంగాణ-డిచ్ పల్లి
ప్రజా సమస్యలు వేలికి తీయడంలో నవ తెలంగాణ ముందు వరుసలో ఉంటుందని విజయవంతంగా 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నవతెలంగాణ పత్రిక యజమాన్యానికి, విలేకరులకు, సిబ్బందికి, ప్రత్యేక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుతున్నానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నవ తెలంగాణతో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ అనుక్షణం ప్రజల పక్షం ఉంటూనే ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా వేలికి తీసి వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా పత్రికల్లో ప్రచురించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడంలో ముందు వరుసలో నిలుస్తూనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. రాబోవు రోజుల్లో పత్రిక మరింత రటు రాటు దేరుతూ ఎల్లవేళలా ప్రజాపక్షం ఉంటూనే ఉన్నత  శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.

Spread the love