– నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
అతి తక్కువ సమయంలోనే ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దినపత్రిక నవ తెలంగాణ పత్రిక అని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంటెంట్ ప్రతిమరాజ్ అన్నారు. నవ తెలంగాణ దినపత్రిక తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా నవతెలంగాణ దినపత్రికలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి విలేకరులకు నవ తెలంగాణ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని ప్రచురించి ముందుకు తీసుకువెళ్తుంది. అదేవిధంగా పత్రిక విలువలను కాపాడుతూ ముందుకు వెళుతున్న పత్రిక నవ తెలంగాణ.ప్రజల సమస్యల పరిష్కారంలో ఎవరి ప్రలోభాలకు లోంగకుండా సమస్యల పరిష్కారానికి దూర దృష్టితో ఆలోచించి ప్రజలందరినీ చైతన్యం చేయడంలో నవతెలంగాణ పత్రిక కీలక పాత్ర పోషిస్తుంది. సామాజిక న్యాయంతో అందరికి అన్ని రకాల హక్కులు అందాలంటూ తనదైన శైలిలో వార్త కథనాలు అందించే పత్రిక సవ తెలంగాణ దినపత్రిక. అదే స్ఫూర్తితో మరెన్నో విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని కోరుతున్నాను.