నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రజా సమస్యలకు వేదికగా, ప్రజల గొంతుగా, నిలబడుతూ సమస్యల పరిష్కార దిశగా కథనాలను వ్రాస్తూ ముందుకు వెళ్తున్న దినపత్రిక తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా పత్రికలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, నవతెలంగాణ సిబ్బందికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మరెన్నో ఉన్నత శిఖరాలను చేరుకొని మంచి మంచి కథనాలతో ఇంకా ప్రజలకు దగ్గర అవ్వాలి. ప్రగతి వైపు మాత్రమే దృష్టి సారించాలి. ఉద్యమాలకు నవతెలంగాణ ఒక సైన్యంగా ప్రశ్నించే గొంతు గా నిలబడుతుంది.