– గవర్నమెంట్ ఆఫ్ రైల్వే నిజామాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సాయి రెడ్డి
నవతెలంగాణ కంఠేశ్వర్
ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ముందుకు వెళ్తున్న దినపత్రిక నవ తెలంగాణ తెలుగు దినపత్రిక అని నిజామాబాద్ రైల్వే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సాయి రెడ్డి తెలిపారు. నవతెలంగాణ దినపత్రిక తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా పత్రికలో పనిచేస్తున్న సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్నారని చిన్న చిన్న కారణాలకు ఒత్తిడిలకు లోనై రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడడం సరైనది కాదని అందుకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించడానికి ఉన్నతాధికారులతో చర్చించి ఆత్మహత్యలు చేసుకోకుండా అవగాహన కార్యక్రమాలను గ్రామాలు పట్టణాలు సిటీలలో చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బంగారు ఆభరణాలు ధరించి ప్రయాణం చేయకుండా ఉంటే దొంగతనాలు అరికట్టవచ్చు అన్నారు. ప్రజల ఎవరికైనా రైల్వే స్టేషన్ పరిధిలో ఎలాంటి సమస్యలు తలెత్తిన 139 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకుని ప్రయాణించాలని కోరారు.