నవతెలంగాణ – అశ్వారావుపేట
సమాజ స్థితిగతుల వాస్తవాలకు దర్పంగా నవతెలంగాణ రాతలు ఉంటాయని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. 2025 నవతెలంగాణ( నూతన సంవత్సర) క్యాలెండర్ ను గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నవతెలంగాణ యాజమాన్యానికి, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. బడుగులు, బలహీనుల పక్షాన నిఖార్సైన పాత్ర పోషించేది నవతెలంగాణ మాత్రమేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇంట్రా డీఈఈ సలీం, నవతెలంగాణ నియోజక వర్గం ఇంచార్జి మడిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.