న‌వ‌తెలంగాణ మార్నింగ్ టాప్ న్యూస్

click here గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం
నవతెలంగాణ – హైదరాబాద్: వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ జరగనుంది. శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. read more

click here రఫాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 35 మంది దుర్మరణం
నవతెలంగాణ – హైదరాబాద్; ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌పై హమాస్‌ చేసిన దాడికి ప్రతీకారంగా ఆ దేశ సైన్యం గాజా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై వైమానిక దాడులతో విరుచుకు పడింది. ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 35 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. read more

click here నేడు పంజాబ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..
నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు(సోమవారం) పంజాబ్ రాష్ట్రానికి వెళ్లనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రేవంత్ ఉదయం హైదరాబాద్ నుంచి పంజాబ్‌కి read more

click here తిరుపతిలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
నవతెలంగాణ – హైదరాబాద్: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న తిరుపతి పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. read more

click here గాలివాన బీభత్సం.. 13 మంది మృత్యువాత
నవతెలంగాణ – హైదరాబాద్: ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం ఆదివారం సాయంత్రం పూట రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రెమాల్‌ తుపాను ప్రభావం తెలంగాణను అతలాకుతలం చేసింది. అప్పటి వరకు ఎండ కాస్తూ… మధ్యాహ్నం ఉన్నట్లుండి భారీ ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి.

Spread the love