నిర్మాణ పనులు పరిశీలించిన నవనాతపురం కమిటీ సభ్యులు

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని సుప్రసిద్ధ దేవస్థానం నవనాద సిద్ధుల గుట్ట నందు నిర్మిస్తున్న శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యానమహాశక్తి క్షేత్రం నిర్మాణ పనుల్లో భాగంగా స్ట్రక్చర్ వేయడం ప్రారంభిస్తున్న టు నవనాథపురం కమిటీ సభ్యులు సోమవారం తెలిపినారుఈ స్ట్రక్చర్ నిర్మాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ కడప జిల్లా, పొద్దుటూరు నిర్మిస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధ్యాన మహా క్షేత్రం 108/108 మహా పిరమిడ్ స్ట్రక్చర్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో పి ఎస్ సి ఎస్ ఎం నవనాథపురం కమిటీ సభ్యులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, చిదుర రాజు ప్రముఖ ఇంజనీర్ శ్రీ శివకాంత్ గారితో పరిశీలించడం జరిగింది. పొద్దుటూరు మహా పిరమిడ్ పరిశీలించి ట్రస్టు సభ్యులైన శ్రీ శివకుమార్ గారు, రవిశంకర్ రెడ్డి గార్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love