వైద్యులు మధు శేఖరు ను సన్మానించిన నవనాథపురం ప్రెస్ క్లబ్

నవతెలంగాణ -ఆర్మూర్  
పట్టణానికి చెందిన ఎం.జి ఆసుపత్రి అధినేత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ రాష్ట్ర చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మధుశేఖర్ ను నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాత్ పుతే శ్రీనివాస్, నవనాథ పురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుంకర్ గంగా మోహన్, ప్రధాన కార్యదర్శి చరణ్ గౌడ్ , కోశాధికారి లిక్కి శ్రావణ్, సలహాదారుడు గణేష్ గౌడ్ లు మధు శేఖర్ కు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు వెంకటేష్ గుప్తా, సామ సురేష్, వినోద్, సూరిబాబు, ముఖేష్, షికారి శ్రీనివాస్ దినేష్, గటడి అరుణ్, మహేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love