నవతెలంగాణ- హైదారాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ కి చెందిన హీరో నవదీప్ తో పాటు నిర్మాత సుశాంత్ రెడ్డి కూడా ఉన్నట్టు హైదరాబాద్ గర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. తాను ఎక్కడికీ పారిపోలేదనిహైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్ లో బిజీగా ఉన్నానని.. ఓ మీడియా ప్రతినిధికి నవదీప్ చెప్పారు. అలాగే ట్విట్టర్ ద్వారా కూడా నవదీప్ స్పందించారు. అది నేను కాదు జెంటిల్ మేన్, నేను ఇక్కడే ఉన్నాను. ముందు క్లారిటీ తెచ్చుకోండి థాంక్స్ అని ట్వీట్ చేశారు.. అయితే ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచందర్ ని నార్కొటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారమే.. నవదీప్ ను డ్రగ్స్ కన్సూమర్ గా తేల్చారు. ఈ విషయాన్ని సీవీ ఆనంద్ మీడియాకి తెలియజేశారు.