నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశాను 24ఏళ్లపాటు ఏకధాటిగా పాలించిన బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌కు తొలిసారి ఓటమి ఎదురయ్యింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్‌కు రాజీనామా లేఖను అందించారు. వెంటనే దాన్ని ఆమోదిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు తాత్కాలిక సీఎంగా కొనసాగమని కోరారు.