స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కు నవీపేట్ పంచాయతీ ఎంపిక..

నవతెలంగాణ -నవీపేట్:  కేంద్ర ప్రభుత్వంచే స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ -2023 జాబితాలో స్వచ్ఛ గ్రామంగా నవీపేట్ పంచాయతీని ఎంపిక చేసినట్లు డి ఎల్ పి ఓ శ్రీకాంత్ మంగళవారం తెలిపారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీడీవో పాలకవర్గంతో పాటు అధికార యంత్రాంగం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామపంచాయతీలకు గాను 15 పంచాయతీలు నిజామాబాద్ డివిజన్ లో 211 పంచాయతీలలో రెండిట్లో ఒకటిగా నవీపేట్ పంచాయతీని ఎంపిక చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా డిఎల్పిఓ శ్రీకాంత్ ను నియమించడంతో స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు వివిధ కోలమానాలపై శాఖల అధికారులతో పనుల విభజన బాధ్యతలను అప్పగించి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, ఇంకుడు గుంతలు, మహిళా సంఘాల అభివృద్ధి, రికార్డు, రోడ్డు  మ్యాపుల నిర్వహణ, ప్లాస్టిక్ ఏరివేత లాంటి 13 కోలమానాలతో పూర్తి పారిశుద్ధ్య గ్రామంగా త్వరలోనే తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) సర్టిఫికెట్ కు సైతం ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాజిద్ అలీ, ఎం పి ఓ రామకృష్ణ, ఏపీవో రాజేశ్వర్, ఎంపీటీసీ మీనా నవీన్ రాజ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love