నవతెలంగాణ – కంటేశ్వర్
రాష్ట్రంలో ప్రధాన పత్రికా రంగంలో పాలక వర్గాల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తే, పత్రికా నిర్వహణలో నవతెలంగాణ అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ప్రజా ప్రత్యామ్నాయంగా బహుజన శ్రామిక ప్రజల, మధ్యతరగతి, ఉద్యోగ, కార్మిక, రైతు, యువజన విద్యార్థి, మహిళా సమ్యసలపై నిత్యం ఉద్యమించే ప్రజలకు గొంతైన వినిపిస్తూ ప్రజల్లో ప్రత్యేక స్థానం ఏర్పచుకుంది. జాతీయ, అంతర్జాతీయంగా రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు వాస్తవ రూపంలో అనేక వ్యాసాలను అందిస్తున్నతీరు ప్రజలకు విషయ పరిజ్ఞానంతో కూడిన విజ్ఞాన దాయకంగా ఉంటుందని నవతెలంగాణ మరింతగా విస్తరించి శక్తివంతమైన ప్రజా గొంతుగా మారాలంటే ప్రజలే నవతెలంగాణ పత్రికా నిర్వహణకు ఆర్థిక అండ ఉండాలు అందించాలని బహుజన లెఫ్ట్ పార్టీ బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.