నిజాలను  నిర్భయంగా రాసేదే నవతెలంగాణ పత్రిక..

– భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
నిజాలను నిర్భయంగా రాసేదే నవతెలంగాణ పత్రిక అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. నవతెలంగాణ పత్రిక బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పత్రికలు పనిచేస్తాయన్నారు. నవతెలంగాణ పత్రిక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చేలా కథనాలు రాయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు కీలక సూచనలు పత్రికలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎంపిటిసి ఉడితే శారద ఆంజనేయులు యాదవ్, పీసీసీ డెలిగేట్ నెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక ప్రమోద్ కుమార్, కౌన్సిలర్లు పోత్తం శెట్టి వెంకటేశ్వర్లు, ఈరపాక నరసింహ, సీపీఐ(ఎం) నాయకులు వడపర్తి మాజీ సర్పంచ్ పాండాల మైసయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నం శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, చుక్క స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి మన్నెమ్మ రాములు యాదవ్, నవతెలంగాణ రిపోర్టర్లు, సిబ్బంది  షేక్ ఉస్మాన్ షరీఫ్, పాక జహంగీర్ లు పాల్గొన్నారు.
Spread the love