నవతెలంగాణ కథనం ఎఫెక్ట్..

– అక్రమ నిర్మాణం, ఇసుక నిల్వపై కలెక్టర్, సీపీ స్పందన..
– అనుమతిచ్చిన తహసిల్దార్ పై కలెక్టరేట్ బదిలీ వేటు..
– సుమారు 40 టన్నుల అక్రమ ఇసుక నిల్వ సీజ్..
నవతెలంగాణ – బెజ్జంకి 
‘ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు’ శీర్షికతో మంగళవారం నవతెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.నవతెలంగాణ కథనానికి జిల్లా కలెక్టర్ మను చౌదరి స్పందించి అక్రమ నిర్మాణానికి అనుమతిచ్చిన గతంలో తహసిల్దార్ గా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్లిన దూల్మీట్ట తహసిల్దార్ ను కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేస్తూ బుధవారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గూడెం గ్రామంలోని సర్వే నంబర్ 321 యందు అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని తొలగించి గ్రామాభివృద్ధి పనులకు కేటాయించేల చర్యలు చేపడుతామని కలెక్టర్ తెలిపినట్టు గ్రామస్తులు తెలిపారు.
సుమారు 40 టన్నుల అక్రమ ఇసుక సీజ్..
ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం మాటునా.. మరోపక్క అక్రమ ఇసుక దందా నిర్వహిస్తున్నారని నవతెలంగాణ కథనానికి పోలీస్ శాఖ అధికారులు స్పందించి బుధవారం అక్రమ ఇసుక నిల్వ స్థావరంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. సీపీ డాక్టర్ అనురాధ అధేశానూసారం సుమారు 40 టన్నుల ఇసుక నిల్వను సీజ్ చేసినట్టు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
కలెక్టర్,సీపీకి గ్రామస్తుల కృతజ్ఞతలు..
ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన గత తహసిల్దార్ అధికారిపై బదిలీ వేటు వేసిన కలెక్టర్ మను చౌదరి,అక్రమ నిర్మాణం మాటునా నిల్వ చేసిన అక్రమ ఇసుక నిల్వను సీజ్ చేసిన సీపీ డాక్టర్ అనురాధకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love