నయా నం.1 సినర్‌

నయా నం.1 సినర్‌– టాప్‌-3లో అల్కరాజ్‌, జకోవిచ్‌
లండన్‌ (ఇంగ్లాండ్‌) : 22 ఏండ్ల ఇటలీ కుర్రాడు జానిక్‌ సినర్‌ ప్రపంచ మెన్స్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన సినర్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన కార్లోస్‌ అల్కరాజ్‌ చేతిలో ఓడినా.. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నం.1 దక్కించుకున్నాడు. స్పెయిన్‌ కుర్రాడు కార్లోస్‌ అల్కరాజ్‌ కెరీర్‌ నాల్గో గ్రాండ్‌స్లామ్‌ విక్టరీతో పాటు వరల్డ్‌ నం.2 స్థానం సాధించాడు. సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనలిస్ట్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) నాల్గో స్థానం నిలుపుకున్నాడు. రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వదేవ్‌ టాప్‌-5లో నిలిచాడు. జర్మనీలో ఏటీపీ చాలెంజర్‌ ట్రోఫీ నెగ్గిన సుమిత్‌ నాగల్‌ ర్యాంకింగ్స్‌లో 18 స్థానాలు మెరుగయ్యాడు. కెరీర్‌ ఉత్తమ 77 ర్యాంక్‌ సాధించాడు. మెన్స్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్న నాల్గో స్థానంలో నిలిచాడు.

Spread the love