ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్ కు నీరజ్ చోప్రా..

నవతెలంగాణ – హైదరాబాద్: వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ కీ అర్హత సాధించాడు భారత్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా. నేడు జరిగిన క్వాలిఫైయర్స్ పోటీల్లో మొదటి ప్రయత్నంలోనే 88.77 మీటర్లు బల్లెం విసిరి ఈ సీజన్ లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. హంగేరి వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ క్వాలిఫైయర్స్ లో.. క్వాలిఫైయింగ్ గ్రూప్ – ఎ లో పోటీపడిన నీరజ్ చోప్రా 88.77 మీటర్లు విసిరాడు. దీంతో ఫైనల్ కు కట్ ఆఫ్ మార్క్ 83 మీటర్లను అధిగమించడంతో ఫైనల్ కీ చేరాడు. ఇక ఆదివారం రోజు ఫైనల్ జరగనుంది.

Spread the love