నవతెలంగాణ-హైదరాబాద్ : నీట్ యూజీ రాష్ట్ర అభ్యర్థుల జాబితాను కాళోజీ వర్సిటీ విడుదల చేసింది. నీట్లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు వచ్చిన అభ్యర్థి రఘురాం రెడ్డి.. రాష్ట్ర ర్యాంకుల్లో టాపర్గా నిలిచారు. ఆయనకు నీట్లో 715 మార్కులు వచ్చాయి. జాగృతి రెండో స్థానంలో నిలిచారు. అయితే ఈ జాబితా కేవలం సమాచారం కోసమేనని హెల్త్ యూనివర్సిటీ స్పష్టం చేసింది. యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపింది.