– నిర్లక్ష్యం వల్లే లింగయ్య చనిపోయాడు
– పోలీసుల తీరుపై అనుమానం.. బంధువుల ఆరోపణ
– చికిత్స అందించిన కే షీట్ ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ -నల్గొండ కలెక్టర్
నల్లగొండలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాకం రోజురోజుకు మితిమీరిపోతుంది. వైద్యశాఖ అధికారులు, పోలీసుల అండదండలతో మూడు పూలు, ఆరు కాయలు అన్న తీరుతో నిరుపేదల దగ్గర వైద్యం పేరుతో అధిక డబ్బులు వసూలు చేయడమే కాకుండా వారి ప్రాణాలకు ఎలాంటి హామీ ఉండదని మరోసారి రుజువు అయింది. జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ లో గల సంకల్ప మల్టీ స్పెషాలిటీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మతి చెందాడు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పల్లపు లింగయ్య (50)ను తలనొప్పి కారణంతో అతని బంధువులు సోమవారం ఉదయం 7 గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని సంకల్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆసుపత్రి వైద్యులు లింగయ్య కు అన్ని చికిత్సలు చేసి చికిత్స అందిస్తామని తెలిపినట్లు బంధువులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో జాయిన్ అయినా అదే రోజు రాత్రి కూడా లింగయ్య కు విపరీతమైన తలనొప్పి రావడంతో లింగయ్య కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించగా ఏమీ కాదని బదిలిచ్చినట్లు తెలిపారు.కాగా మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో లింగయ్య మరణించాడు. డోసు కు మించిన మందులు ఇవ్వటం, నిర్లక్ష్యంగా చికిత్స అందించడం ద్వారానే లింగయ్య మరణించారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. లింగయ్య కు అందించిన చికిత్స కు సంబంధించిన వివరాల కే షీట్ ను అందివ్వాలని వారు డిమాండ్ చేయగా ఆస్పత్రి వివాహకులు కే షీట్ ను ఇవ్వలేదు.
కుటుంబ సభ్యులపై దాడి…
లింగయ్య మరణించడంతో రోధిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులపై ఆస్పత్రి నిర్వహకులు దాడి చేశారని లింగయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఆసుపత్రికి పెద్ద ఎత్తున పోలీసులు రావడం,వచ్చిన పోలీసులు విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోకుండా చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఆస్పత్రి నిర్వహణకులకు పోలీసులు మద్దతు తెలపడం, అంతేకాకుండా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసే ఓ ఉద్యోగి ఆసుపత్రి వర్గానికి మద్దతుగా రావడం ఓ కింత ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాలి.
ఆసుపత్రి వర్గాల వివరణ…
పల్లపు లింగయ్య మా వద్దకు చికిత్సకు రాగా సరైన చికిత్స నే అందించాం. కార్డియాక్ అరెస్టు కావడం వల్లే లింగయ్య మతి చెందాడు. మేము అందించిన చికిత్సకు మతికి సంబంధం లేదు.