కొంపల్లిలో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం.. ఇద్దరు మృతి

నవతెలంగాణ- హైదరాబాద్‌:  బషీర్‌బాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొంపల్లిలో ఆర్‌ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థలో పనిచేస్తోన్న ఇద్దరు కార్మికులపై గ్రానైట్‌ రాయి పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలోనే మృతి చెందారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా పనులు చేస్తుండటం వల్లే ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు ఆరోపించారు. మృతులు ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన శరణ్‌ (36), లక్ష్మణ్‌ బరాక్‌(25)గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

Spread the love