– డీలర్ శంకర్ కు లక్ష 82 వేల జరిమానా విధింపు
– కొప్పుల రేషన్ డీలర్ కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగింత
– ఆలస్యంగా వెలుగు చూసిన వైనం
నవతెలంగాణ – శాయంపేట : మండలంలోని నేరేడుపల్లి, కాట్రపల్లి గ్రామాలలోని రేషన్ షాపులపై ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి బియ్యం నిల్వలలో తేడాలు రావడంతో,రెండు రేషన్ షాప్ లలో నిల్వలపై సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వగా 46 క్వింటాళ్ల 91 కిలోల బియ్యంపై కిలోకు 39 రూపాయల చొప్పున జరిమానా విధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సివిల్ సప్లై డిటి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం…. మండలంలోని కాట్రపల్లి రేషన్ డీలర్ వాంకుడోత్ శంకర్ నేరేడుపల్లె డీలర్ షాపుకు ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు రేషన్ షాప్ లపై ఆకస్మిక దాడులు నిర్వహించగా కాట్రపల్లిలో 29.91 క్వింటాళ్ల బియ్యం తక్కువ రాగా, నేరేడు పల్లెలో 17 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఎక్కువగా వచ్చింది. సమాచారాన్ని సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించగా సివిల్ సప్లై డిటి సత్యనారాయణ రావు సందర్శించి ఏ ఆర్ ఐ హుస్సేన్ సమక్షంలో రెండు రేషన్ షాపులను సీజ్ చేసి కొప్పుల డీలర్ సామల మల్లయ్య కు తాత్కాలిక ఇన్చార్జి డీలర్ గా బాధ్యతలు అప్పగించారు. రేషన్ డీలర్ శంకర్కు 1,82,949 జరిమానా విధించినట్లు తెలిపారు.