నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రత్యేకమైన కాఫీల శ్రేణితో ప్రీమియం కాఫీలో అగ్రగామిగా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెస్ ప్రెసో 2024 చివరి నాటికి భారతదేశంలో ప్రారంభించ బడుతుంది. నెస్ ప్రెసో కాఫీలు మరియు మెషీన్‌లు సాధారణ, వృత్తిపరమైన వినియోగదారులకు సేవలందించేందుకు ఒరిజినల్ మరియు ప్రొఫెషనల్ సిస్టమ్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటాయి. ఇతర ముఖ్య నగరాలకు విస్తరించే ముందు, మొదటి నెస్ ప్రెసో బోటిక్ దిల్లీలో ప్రారంభం కానుంది. నెస్ ప్రెసో ఇ-కామర్స్ ప్లాట్‌ఫా మ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో కూడా విక్రయించబడుతుంది. ఈ ఆవిష్కరణ నెస్లే ఇండియా ప్రీమియం కాఫీ ఆఫర్‌లను మెరుగుపరుస్తుంది. సర్టిఫైడ్ బికార్ప్ అయిన నెస్ ప్రెసో కాఫీ వినూత్నతలను రూపొందించడం, అసమానమైన కాఫీ మిశ్రమాలను కనుగొనడం, కొత్త రుచులను రూపొందించడంలో కీలకపాత్ర పోషించనుంది. ఇది వి నియోగదారులకు ప్రీమియం కాఫీ అనుభవాన్ని అందిస్తుంది. అన్ని నెస్ ప్రెసో కాఫీలు అధిక నా ణ్యతతో స్విట్జర్లాండ్‌లోని అత్యాధునిక తయారీ కర్మాగారాల్లో తయారు చేయబడతాయి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెస్లే మార్కెట్‌లకు ఎగుమతి చేయబడతాయి. ఈ సందర్భంగా నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ మాట్లాడుతూ, “భారతదేశంలోని వినియోగదారులకు, కాఫీ ప్రియులకు, కొత్త అనుభవాలను అందించడానికి, అసా ధారణమైన కాఫీలను కనుగొనడానికి నెస్ ప్రెసో త్వరలో అందుబాటులోకి రానుందని తెలియజే యడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇటీవలి సంవత్సరాలలో, భారతదేశంలో కాఫీ వినియో గం పెరిగింది. గృహ వినియోగం పట్ల స్పష్టమైన పెరుగుదల ధోరణి ఉంది. పెరుగుతున్న యువ జనాభా, గ్లోబల్ ట్రెండ్‌లకు గురికావడం, కొత్త అనుభవాల కోసం అన్వేషణ అనేవి నెస్లేకు సంబం ధించి వేగంగా అభివృద్ధి చెందుతున్న కాఫీ మార్కెట్‌లలో ఒకటిగా భారతదేశాన్ని నిలబెట్టాయి. నెస్లే నెస్ ప్రెసో ఎస్.ఏ. సీఈఓ గులాయుమె కన్ఫ్ మాట్లాడుతూ, “మేం భారతదేశంలోని కాఫీ ప్రి యులకు నెస్ ప్రెసో ను పరిచయం చేయబోతున్నందుకు సంతోషి స్తున్నాను. మా ప్రత్యేక రుచి ద్వారా కాఫీ అనుభూతిని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు నలభై ఏళ్లుగా నెస్ ప్రెసో కట్టు బడి ఉంది. ఒక మంచి చేసేందుకు కాఫీ ఒక శక్తిగా ఉండగలదనేది సుస్థిరత పట్ల మా కట్టుబాటు తో మిళితమైంది. 2011 నుండి భారతదేశం నుండి గ్రీన్ కాఫీని సోర్సింగ్ చేసిన తర్వాత, చక్కటి వృద్ధి అవకాశాలను అందించగల ఈ మంచి కాఫీ మార్కెట్‌లో బ్రాండ్ వృద్ధిని చూడడానికి నేను సంతోషిస్తున్నాను”’’ అని అన్నారు. నెస్ ప్రెసో AAA సస్టైనబుల్ క్వాలిటీ ప్రోగ్రాం ద్వారా అధిక-నాణ్యత బీన్స్ పై నెస్ ప్రెసో దృష్టి పెడు తుంది. ఇది 2003లో రెయిన్‌ఫారెస్ట్ అలయన్స్ సహకారంతో రూపొందించబడింది. ఈ కార్యక్రమం లో ఇప్పుడు 18 దేశాలలో 150,000 మంది కాఫీ రైతులు ఉన్నారు. దాదాపు 600 మంది నెస్ ప్రెసో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా పని చేస్తారు, కాఫీ నాణ్యత, వ్యవసాయ ఉత్పాదకత మరియు సుస్థిరత్వాన్ని మెరుగుపరచడానికి శిక్షణ, వనరులను అందిస్తారు. అధిక నాణ్యత గల కాఫీని నెస్ ప్రెసో కి విక్రయించడం ద్వారా, రైతులు తమ ఆదాయాన్ని మరియు మరింత సురక్షిత మైన జీవనోపాధిని అందుకుంటారు. 2011 నుండి భారతదేశం నుండి నెస్ ప్రెసో AAA సస్టైనబుల్ క్వాలిటీ కార్యక్రమం. నెస్ ప్రెసో AAA సస్టైనబుల్ క్వాలిటీ ప్రోగ్రాం ద్వారా ద్వారా 93% పైగా కాఫీ సుస్థిరదాయక రీతిలో లభిస్తుంది. నెస్ ప్రెసో భారతదేశం నుంచి అధిక నాణ్యమైన గ్రీన్ కాఫీని సేకరిస్తోంది మరియు దేశంలోని దాదాపు 2,000 మంది కాఫీ రైతులతో నేరుగా పని చేస్తుంది. స్విట్జర్లాండ్ లోని లాసాన్ లో ప్రధాన కార్యాలయం కలిగిన నెస్ ప్రెసో 90 మార్కెట్‌లో లభ్యమవుతుంది, ఇది సుమారు 500 నగరాల్లో 800 పైగా షాపుల నెట్‌వర్క్ ను కలిగి ఉంది.