కొత్తగా 42 వేల మందికి ఉద్యోగావకాశాలు

– ఇంగ్లాండ్‌, అమెరికాలో ముగిసిన మంత్రి కేటీఆర్‌ పర్యటన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అమెరికా, ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు, ప్రకటనల వల్ల రాష్ట్రానికి కొత్తగా 42 వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. మంత్రి పర్యటన గురువారం విజయవంతంగా ముగిసింది. రెండు వారాల ఈ పర్యటనలో పలు కంపెనీ లతో 80కి పైగా సమావేశాలు, ఐదు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలతో పాటు రెండు కాన్ఫరెన్స్‌లలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో వినోద రంగంలో అగ్రగామి సంస్థ అయిన వార్నర్‌ బ్రదర్స్‌- డిస్కవరీ, హెల్త్‌ కేర్‌ టెక్నాలజీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్‌ ట్రానిక్‌, ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడుల సంస్థ స్టేట్‌ స్ట్రీట్‌, బైన,్‌ క్యాపిటల్‌కు చెందిన వీఎక్స్‌ ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ తో పాటు లండన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ గ్రూప్‌ కంపెనీలు తెలంగాణ ప్రగతి ప్రస్థానం లో భాగస్వామ్యమయ్యేందుకు ముందు కొచ్చాయి. 12న లండన్‌లో జరిగిన ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ సదస్సుకు హాజరైన కేటీఆర్‌, తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు.
ఇండియా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే తెలంగాణ మోడల్‌ను అనుసరించా లన్నారు. ఈనెల 22 న అమెరికా నెవాడాలోని హెండర్సన్‌లో అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీర్స్‌ నిర్వహి ంచిన ప్రపంచ పర్యావరణ, జల వనరుల కాంగ్రెస్‌లో మంత్రి కేటీఆర్‌ కీలకోపన్యాసం చేశారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల విజయ గాథను అమెరికన్‌ ఇంజినీర్లకు చెప్పా రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అమెరికన్‌ సివిల్‌ ఇంజనీర్ల సంఘం ప్రకటించిన ‘ఎండ్యూరింగ్‌ సింబల్‌ ఆఫ్‌ ఇంజినీ రింగ్‌ ప్రోగ్రెస్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌’ అవార్డును అందుకున్నారు. తెలంగాణ లోని టైర్‌-2 నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ముందు కువచ్చాయి. 30కి పైగా కంపెనీల సీఈఓలతో కేటీఆర్‌ సమావేశమై టైర్‌-2 నగరాల్లో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేలా ఒప్పించారు. నల్లగొండ ఐటీ టవర్‌లో 200 మంది ఉద్యోగులతో కార్యకలా పాలు ప్రారంభించేందుకు ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ సొనాటా నిర్ణయిం చుకుంది. కరీంనగర్‌లో ఆపరేషన్‌ సెంటర్‌ను ప్రారంబిస్తామని 3ఎమ్‌ ఈసీఎల్‌ఏటీని ప్రకటించింది. తమ కార్యకలాపాలను వరంగల్‌కు విస్తరిం చేందుకు రైట్‌ సాఫ్ట్‌వేర్‌ రెడీ అయింది. ఈ పర్యటనలో మంత్రితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమో షన్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణు వర్ధన్‌ రెడ్డి, ఇతర అధికారులు దిలీప్‌ కొణతం, శక్తి ఎం నాగప్పన్‌, ప్రవీణ్‌, అమర్నాథ్‌ రెడ్డి ఆత్మకూరి, వెంకట శేఖర్‌ ఉన్నారు.

Spread the love