దేశవ్యాప్తంగా కొత్త మెడికల్‌ కాలేజీలు

– వైద్యవిద్యకు మోడీ పెద్దపీట
– గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా కొత్త మెడికల్‌ కాలేజీలను నెలకొల్పటం ద్వారా ప్రధాని మోడీ వైద్యవిద్యకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళసై సౌందర రాజన్‌ తెలిపారు. నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఏసియన్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ)లో నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రాంలో ఆమె పాల్గొన్నారు.
సర్జరీల్లో రోబోటిక్స్‌ వినియోగం, సాంకేతికంగా పురోగతిని అందిపుచ్చుకుని వైద్యవిద్యలో శిక్షణ పొందిన సిబ్బందికి ఎక్కువగా డిమాండ్‌ ఉందని తెలిపారు. నేటితరం వైద్యవిద్యార్థులు అదష్టవంతులంటూ వారికి డిజిటల్‌ పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు.. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి (ఏఐజీ), డాక్టర్‌ సంగీతారెడ్డి (అపొలొ హాస్పిటల్స్‌), ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అభిజత్‌ షేత్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ సి.మల్లికార్జున్‌ (ఎన్‌బీఈఎంఎస్‌), ఎండీ డాక్టర్‌ సురేందర్‌ రావు (యశోద హాస్పిటల్స్‌) పాల్గొన్నారు.

Spread the love