తెలంగాణ నూతన మంత్రులు

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనునున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నేడు మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి ముఖ్యనేతలుగా ఉన్న ముగ్గురికీ కేబినెట్లో చోటు దక్కింది. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నల్గొండ జిల్లా నుంచి ఊహించిన విధంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అవకాశం కల్పించారు. వీరితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మెదక్ జిల్లా నుంచి దామోదర్ రాజనర్సింహ, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. మంత్రివర్గ జాబితాలో ఉన్న వారికి రేవంతే స్వయంగా ఫోన్ చేస్తున్నారు.

Spread the love