ఎమ్మెల్యే ధృవీకరణ పత్రం అందుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డి

నవతెలంగాణ- దుబ్బాక రూరల్: దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో 53,707 ఓట్ల మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. ఐతే ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత
ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి అందుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వెంట బీఆర్ఎస్ మహిళ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్, సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి పంతులు, వెంకట నరసింహ రెడ్డి, రామవరం చంద్రశేఖర్ రెడ్డి, లచ్చపేట అంజనేయులు తదితరులు ఉన్నారు
Spread the love