– బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బర్త్ డే ప్రత్యేక సంచిక ఆవిష్కరణలో నిజామాబాద్ డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి

నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి : నవతెలంగాణ దినపత్రిక పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా వార్తలు కథనాలు ప్రచురిస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తుందని నిజామాబాద్ డిసిసి అధ్యక్షులు కాట్పల్లి నగేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచికను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ తెలంగాణ పత్రిక పది సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో కొనసాగుతుందని ఈ కాలంలో అనేక ప్రజా సమస్యలు విలికితీస్తూ నిష్పక్షపాతంగా వార్తలు రాస్తూ కచ్చితంగా సేకరిస్తూ వస్తుందని అన్నారు. పార్టీలకతీతంగా ఉంటూ అన్ని వర్గాల ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరింప చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తుందని అన్నారు. మున్ముందు సైతం ఇదేవిధంగా రాణిస్తూ మరింత పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా వెలువరించిన ప్రత్యేక సంచిక పరిశీలించారు. పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మహేష్ కుమార్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు నవ తెలంగాణ రీజియన్ మేనేజర్ అనంతుల సురేష్, ఉమ్మడి జిల్లా స్టాపర్ (ప్రాంతీయ ప్రతినిధి) మీస మధు, ఆర్మూర్ డివిజన్ ఇంచార్జ్ కర్రోల్ల గోపి, రికవరీ సర్కులేషన్ ఇంచార్జ్ సంతోష్, రిపోర్టర్ బి రాజు తదితరులు పాల్గొన్నారు.



