కొత్త వైన్స్ లు షురూ..

– మండలంలో రెండు వైన్స్ లు రెండేళ్లు నిర్వహణ..
నవతెలంగాణ- మల్హర్ రావు
జిల్లా వ్యాప్తంగా కొత్త వైన్స్ లు ఈ నెల 1న ప్రారంభమైయ్యాయి.మద్యం టెండర్లకు వ్యాపారులు పోటెత్తగా ఆగస్టులో లక్కీడ్రా ద్వారా కలెక్టర్ చేతులమీదుగా షాపులు కేటాయించారు. రెండు దుకాణాలకు 45 దరఖాస్తులు రాగా ఎక్సైజ్ శాఖకు రూ.90 లక్షల ఆదాయం వచ్చింది. చివరిరోజు పెద్దఎత్తున దరఖాస్తులు రావడంతో ఆదాయం పెరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం నాలుగు నెలల ముందే టెండర్ల ప్రక్రియ స్వీకరించడంతో గత నెల 30వరకు పాత దుకాణ నిర్వాహకులే అమ్మకాలు జరిపారు. కొత్తగా టెండర్లు దక్కించుకున్నారు శుక్రవారం వ్యాపారులు ప్రారంభించారు. 2023 డిసెంబర్ 1 నుంచి 2025 నవంబర్ 30 వరకు కొత్త దుకాణాలు కొనసాగనున్నాయి.కొత్తగా వైన్స్ లు దక్కించుకున్నవారు మనుషుల బారమని ఆలోచించి అనుభవం ఉన్న పాత వ్యాపారులకు అమ్మేషే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఎన్నికల్లో పాత వ్యాపారులు పెద్దయెత్తున అమ్మకాలు జరిపారు. కొత్తగా వచ్చిన వారు 1న ప్రారంభించగా మున్ముందు స్థానిక సంస్థలు, ఎంపీల ఎన్నికలు ఉండడంతో లాభాల వర్షం కురిపిస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Spread the love