కమ్మర్ పల్లి మండల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గం మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయల మండల స్థాయి కార్యవర్గ సమావేశం జిల్లా కన్వీనర్ ఎం. వెంకటరమణ, జిల్లా కో కన్వీనర్ గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో మండలను తన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులుగా పసుపుల ప్రసాద్( మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్యాట హాస కొత్తూర్), మండల ప్రధాన కార్యదర్శిగా లక్మ సంతోష్ ( మండల పరిషత్ ప్రాథమిక బాలికల పాఠశాల, చౌట్ పల్లి), మండల ఉపాధ్యక్షులుగా గుర్రాల రాధా కిషన్ ( మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, నర్సాపూర్), మండల కోశాధికారిగా గుజ్జేటి రవీందర్ ( మండల పరిషత్ ప్రాథమిక బాలికల పాఠశాల, కమ్మర్ పల్లి), మండల కార్యవర్గ సభ్యులుగా వేణుగోపాల్ ( మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్యాట హాస కొత్తూర్),సున్నం శ్రీనివాస్, సింగరి రాజేశ్వర్, జి.శ్యామల ( మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కమ్మర్ పల్లి) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలకు అతీతంగా మండలంలోని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.