నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్
ముషీరాబాద్ వైశ్య హాస్టల్ లో ఆదివారం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐ వి ఎఫ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు 2024, తంబోలా కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్-ఐ వి ఎఫ్ చైర్మన్ అడ్వైసరి బోర్డ్ సెంట్రల్ కమిటీ న్యూఢిల్లీ, గంజి రాజమౌళి గుప్తకు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐ వి ఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణను పురస్కరించుకొని గంజి రాజమౌళి గుప్తకు, ఉప్పల శ్రీనివాస్ గుప్తకు కాచారం అంజయ్య స్వామి శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐవిఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్, ఐ వి ఎఫ్ నాయకులు లెంకలపల్లి శ్రీనివాస్, ఐ వి ఎఫ్ నాయకులు నువ్వుల రమేష్ గుప్తా, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.