– వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గంప శ్రీనివాస్
– ఘనంగా వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో జర్నలిస్టుడే దినోత్సవం
నవతెలంగాణ – సిద్దిపేట
సమాజంలో ప్రజలను చైతన్యం చేసేది వార్త పత్రికలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గంప శ్రీనివాస్ అన్నారు. జర్నలిస్టు డే దినోత్సవ సందర్భంగా ముందస్తుగా స్థానిక పౌల్ట్రీ అసోసియేషన్ హాలులో వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్, వాసవి యూత్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జరిగే ఏ రకమైన సేవలు అయినా ప్రజల దృష్టికి తీసుకువచ్చేది పాత్రికేయలేనని, వాసవి క్లబ్ చేస్తున్న సేవలను కూడా వారు పత్రికల ద్వారా ప్రజలకు అందజేయడం సంతోషకరమని అన్నారు. పాత్రికేయులు అంజన్న , సంజీవరెడ్డి, రాజు, రంగదాంపల్లి శీను, గరిపల్లి శ్రీనివాస్ , సతీష్ కుమార్, బాబురావు, పాండు, వెంకటేష్ ,యాదవ రెడ్డి, శ్రీకాంత్, నరసింహ, రమేష్, కుమారస్వామి, భాస్కర్, స్వామి, శ్రీనివాస్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ నేషనల్ కోఆర్డినేటర్స్ గంప కృష్ణమూర్తి, యాద శ్రీనివాస్, రీజియన్ చైర్మన్ పుల్లూరి శివకుమార్, డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ మాంకాళ నవీన్ కుమార్, జోన్ చైర్మన్ సోమ వనజ, రీజియన్ సెక్రెటరీ మాంకాళ శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షుడు చింత రాజేంద్రప్రసాద్, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు తొడుపునూరి కృష్ణవేణి, వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు అర్వపల్లి హరికిరణ్, కార్యదర్శి చకిలం రవి, కోశాధికారి బూరుగు వేణుగోపాల్,తిమిశెట్టి విజయలక్ష్మి , పీఆర్వో అయిత శంకర్,కొండూరు వెంకటేశం,వెలిశాల పోషనాథం,బుక్క శివ కుమార్ ,కొండూరు సతీష్ ,జూలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.