కరోనా కష్టకాలంలో ప్రాణాలకు పణంగా పెట్టిన ఎన్ హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ-కంటేశ్వర్
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు పణంగా పెట్టిన ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ధర్నా చౌక్ వద్ద ఎన్హెచ్ఎం ఉద్యోగులు తొమ్మిది రోజుల నుండి సమ్మె కొనసాగిస్తున్న సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని యుపిహెచ్సి మరియు యుసి హెచలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పారామెడికల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చాలా కాలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము. ఎన్హెచ్ఎంలో సుమారు 17 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో అత్యధికులకు రాష్ట్ర ప్రభుత్వం పిఅర్సి ప్రకారం జీతభత్యాలు చెల్లించడం లేదు. గతంలో జీఓ నెం.510 ద్వారా సుమారు 10 వేల మంది వరకు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఎఎన్ఎం తదితరులకు బేసిక్ ప్రకారం వేతనాలు నిర్ణయించి చెల్లిస్తున్నారు. ఇందులో కొన్ని కేటగిరీలకు పర్మినెంట్ ఎంప్లాయీ బేసిక్ కన్నా తక్కువ చెల్లిస్తున్నారు. మిగిలిన సుమారు 7 వేల మందికి కనీస బేసిక్ కాకుండా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. వీరందరికీ కనీస వేతనం, డీఎ, హెచ్ఎ, తదితర అలవెన్సులు నిర్ణయించి అమలు చేయాలి. ప్రభుత్వ పిఆర్సి ప్రకారం కనీస వేతనాలు అమలు కాకుండా తక్కువ వేతనాలు పొందుతున్న కేడర్లలో అర్బన్ హెల్త్ సెంటర్స్లో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది, అకౌంటెంట్స్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, పబ్లిక్ హెల్త్ మేనేజర్ (కమ్యూనిటీ ఆర్గనైజర్స్), సపోర్టింగ్ స్టాఫ్లోని మెడికల్ అసిస్టెంట్స్, వాచ్మెన్, స్వీపర్స్ మరియు బస్తీ దవఖానాలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, సపోర్టింగ్ స్టాఫ్ అలాగే బ్లడ్ బ్యాంక్ డిఇఓ, ల్యాబ్ అటెండర్, ఎస్ఎస్సీయు సిబ్బంది, ఎంసిహెచ్ హాస్పిటల్స్ లోని ఓటి అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డ్స్, సపోర్టింగ్ స్టాఫ్, ఆర్ఎఎస్కి మెడికల్ ఆఫీసర్లు, ఫార్మాసిస్టులు, ఏఎన్ఎంలు, డ్రైవర్లు, ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న ఎస్ఎస్ఓ, ఎఫ్ఎస్ మరియు డిఎసిస్, ఎన్ సిడీ, టిబి లెప్రసీ, ఎస్ఆరెస్, టిడి హబ్, సిహెచ్ కంటింజెంట్ తదితర విభాగాలలో పని చేస్తున్న వారందరూ తక్కువ వేతనాలు పొందుతున్నారు. వీరందరికీ వారి కేడర్ ప్రకారం వైద్య, ఆరోగ్య శాఖలోని పర్మినెంట్ ఉద్యోగుల యొక్క బేసిక్, అలవెన్సులు నిర్ణయించాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.గత అనేక సం॥లుగా పనిచేస్తున్న ఎన్ హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉంది. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.
510 జీఓ అమలు కాని కేడర్లకు కూడా బేసిక్, డిఎ, హెచ్ఐ తదితరములు కలిపి గ్రాన్ శాలరీ
 ఎన్హెచ్ఎం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని రూపొందించాలి. మెడికల్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు షాదుల్లా, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మురళీ, రమేష్, రవి గౌడ్, గంగాధర్, వెంకటేష్, లక్ష్మణ్, వందన, నవత, సంతోష్ ఆనంద్ శ్యామ్ సత్యనారాయణ హుస్సేన్ మానస తదితరులు పాల్గొన్నారు.
Spread the love