ఐదు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ సోదాలు

నవతెలంగాణ – న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) శనివారం ఉగ్రవాద కేసులో ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈకేసులో పాకిస్తాన్‌కు చెందిన జైష్‌ -ఇ-మహ్మద్‌ అనే ఉగ్రవాద సంస్థపై చేస్తున్న దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఎ జమ్మూ అండ్‌ కాశ్మీర్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, అస్సాం, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాల్లో సుమారు 22 ప్రదేశాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Spread the love