అదుపులో నిఫా కేసులు..

నవతెలంగాణ – తిరువనంతపురం : కేరళలో నిఫా వైరస్‌ కేసులు అదుపులోనే ఉన్నాయి. ఈ నెల 16 నుంచి కొత్త కేసులు నమోదు కాలేదు. దీంతో కొజికోడ్‌ జిల్లాలోని పలు పంచాయతీల్లో ఆంక్షలు సడలించారు. ఈ విషయాన్ని జిల్లా విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాలేదు. హై రిస్క్‌ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న 218 మంది నమూనాలను పరీక్షించగా.. నెగెటివ్‌ లక్షణాలు కనిపించాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో జిల్లాలోని 53 వార్డులు, పంచాయతీల్లో ఆంక్షలను సడలించినట్లు ప్రభుత్వం తెలిపింది. కంటై న్మెంట్‌ జోన్ల పరిధిలో ఉన్న దుకాణాలను రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచవ చ్చు. మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే నిఫా పూర్తిగా నియంత్రణ కాకపోవడంతో కచ్చితంగా మాస్క్‌, సానిటైజర్లను వినియోగించాలని సూచించింది. దీంతోపాటు భౌతిక దూరం పాటించాలని ఆంక్షల్లో పేర్కొంది. కొత్త నిబంధనలు వచ్చేంత వరకు ఈ ఆంక్షలు సడలింపు అమలవుతాయని తెలిపింది. అయితే టెస్ట్‌ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు, నిఫా సోకిన వారు కఠినమైన ఆంక్షలను కచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఆరోగ్య శాఖ సూచన మేరకు క్వారంటైన్‌లో ఉండాలని జిల్లా కలెక్టర్‌ తెలియజేశారు.

Spread the love