నవతెలంగాణ – హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల, ప్రతికూల సెంటిమెంట్ల ప్రభావం భారత మార్కెట్ పై పడింది. సెన్సెక్స్ 13.65 పాయింట్ల వృద్ధితో 81,711 వద్ద ముగిసింది. నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 25,017 వద్ద స్థిరపడింది. వరుసగా రెండో రోజు కూడా నిఫ్టీ 25 వేలకు ఎగువన ముగియడం విశేషం.