వేతనాల పెంచాలని నైజీరియా కార్మికుల నిరసనలు

నవతెలంగాణ – అబుజా : వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నైజీరియా కార్మికులు దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. ఈ నిరసన కారణంగా విమాన రవాణా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా దేశంలోని అతి ముఖ్యమైన ముర్దాలా మహమ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా స్తంభించిపోయింది. దేశ ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక సంక్షోభం జీవన వ్యయాన్ని పెంచాయి. కానీ కార్మికులకు వేతనాలు మాత్రం పాతాళానికి పడిపోతున్నాయి. ఈ సందర్భంలో దేశంలోని కార్మికులు జీవన సంక్షోభాలను ఎదుర్కోవటానికి కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. “మేము జీవన వేతనాన్ని డిమాండ్ చేస్తున్నాము” అని నైజీరియన్ లేబర్ కాంగ్రెస్ తెలిపింది. అంతేకాదు ప్రస్తుతం మన కార్మికులు ఆకలి చావులు అందుకుంటున్నారని లేబర్ కాంగ్రెస్ దేశ కార్మికుల పరిస్థితిని వివరించింది. ఈ వేతనంతో కార్మికులు బతకలేని పరిస్థితి నెలకొంది. జీవన స్థితిగతులను మెరుగుపరచాలని వేతనాలు పెంచాలని కోరుతూ కార్మికులు ఒక్కతాటిపైకి వచ్చి దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. నైజీరియన్ లేబర్ కాంగ్రెస్ మరియు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఈ పోరాటాన్ని సమన్వయం చేయడానికి నైజీరియా అంతటా కార్మికులను ఏకం చేశాయి. నైజీరియాలో కార్మికులకు ప్రస్తుత నెలవారీ వేతనం 30,000 నైరా (రూ. 1,693) మాత్రమే.

Spread the love