పోతంగల్ లో కాంగ్రెస్ కార్యకర్తపై రాత్రి దాడి

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని పోతంగల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త నరేష్ గౌడ్ పై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు వేసుకొని గురువారం రాత్రి దాడి చేసినట్లు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి మద్యం సేవించి  నిద్రపోయి రాత్రి 3 గంటల ప్రాంతంలో నిద్ర లేచి ఇంటి బయటకు బాత్రూం కోసం తలుపు తీసి రాగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు వేసుకొని దాడి చేసి వెళ్లిపోయారని బాధితుడు తెలిపాడు. శుక్రవారం ఉదయం చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కాగా పోలింగ్ సందర్భంగా ప్రతిపక్ష నాయకులతో జరిగిన వాగ్వివాదమే దాడికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
Spread the love