విడాకులకు అప్లై చేసుకున్న నిహారిక – చైతన్య

నవతెలంగాణ- హైదరాబాద్: నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకులపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అందరూ ఊహించినట్లుగానే వీళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మే19వ తేదీన వీరిద్దరూ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. మ్యూచువల్‌గా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారికకు చైతన్య జొన్నలగడ్డతో 2020 డిసెంబర్‌లో ఉదయ్‌పూర్‌ వేదికగా వివాహమైన విషయం తెలిసిందే.

Spread the love