ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్‌

న్యూఢిల్లీ : ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ దూసుకుపోతుంది. ఏకపక్ష విజయాలతో ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. మహిళల 50 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన రెండో రౌండ్‌ బౌట్‌లో నిఖత్‌ జరీన్‌ 5-0తో ఏకపక్ష విజయం నమోదు చేసింది. అల్జెరీయ బాక్సర్‌ బౌలామ్‌ రౌమయిసను చిత్తు చేసిన నిఖత్‌ జరీన్‌ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో ప్రీ క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకుంది. ఆఫ్రికా డిఫెండింగ్‌ చాంపియన్‌పై పదునైన పంచ్‌లు సంధించిన నిఖత్‌ జరీన్‌ ఐదుగురు న్యాయమూర్తుల ఏకగ్రీవ విజేతగా నిలిచింది. 29-27, 30-26, 29-27, 30-26, 29-27తో (5-0) ఐదుగురు జడ్జీలు నిఖత్‌ జరీన్‌కు తిరుగులేని ఆధిపత్యం కట్టబెట్టారు.

Spread the love