నింగినై నిన్ను చూస్తుంటా..

Ninginai
I will see you..అభయ్ నవీన్‌, అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేష్‌, దయానంద్‌ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రాక్షస కావ్యం’. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్‌, పింగో పిక్చర్స్‌, సినీ వ్యాలీ మూవీస్‌ బ్యానర్స్‌లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. నవీన్‌ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలు. ఉమేష్‌ చిక్కు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. శ్రీమాన్‌ కీర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘అమ్మ పాట..’ లిరికల్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. మిట్టపల్లి సురేందర్‌ సాహిత్యం అందించిన ఈ పాటకు రాజీవ్‌ రాజ్‌, శ్రీకాంత్‌ ఎం ట్యూన్‌ కంపోజ్‌ చేయగా, శివాని సీహెచ్‌ పాడారు. ‘నింగినై నిన్ను చూస్తుంటా.. నేలనై నిన్నుమోస్తుంటా..’ అంటూ బిడ్డలపై అమ్మ చూపే ప్రేమను వర్ణిస్తూ సాగుతుందీ పాట. అమ్మ గొప్పదనాన్ని తన సాహిత్యంలో మిట్టపల్లి సురేందర్‌ ఆవిష్కరించగా..ప్లెజంట్‌ ట్యూన్‌లో హదయానికి హత్తుకునేలా శివాని సీహెచ్‌ పాడారు. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన ఒక కొత్త తరహా సినిమా ఇది.

Spread the love