టోక్యో: జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు హోండా మోటార్ కో, నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ విలీనం నిలిచిపోయింది. తమ వ్యాపారాలను ఒక్కటిగా చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుం టున్నట్లు ఇరు కంపెనీలు ఓ ప్రకటనలో స్పష్టం చేశాయి. విలీన చర్చలపై ఇక ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు గురువారం ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని ఎదుర్కొనేందుకు ఈ దిగ్గజ కంపెనీలు విలీనమై ఓ సంయుక్త భాగస్వామ్య కంపెనీని నెలకొల్పాలని భావించినట్లు గతేడాది డిసెంబర్‌లో తెలిపాయి. ఇందులో నిస్సాన్ అనుబంధ సంస్థ అయిన మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్ కూడా విలీనం చేసి మూడు సంస్థలూ కలిసి చర్చలు ప్రారంభించగా.. ఆదిలోనే విరమించుకోవడం వాహన పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.