బలపరీక్షలో నెగ్గిన నితీష్ సర్కార్

నవతెలంగాణ – బీహర్: బీహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నితీష్‌కుమార్ సర్కార్ విజయం సాధించింది. అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో సీఎం నితీశ్ కుమార్‌కు 129 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన బలపరీక్షలో సునాయసంగా గట్టెక్కేశారు. మరోవైపు అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.  అంతకముందు ఆర్జేడీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌లో ఉంచారు. జేడీయూకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు నితీష్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారేమోనని ప్రచారం జరిగింది. కానీ మొత్తానికి నితీష్ కుమార్ ఫ్లోర్ టెస్ట్‌లో నెగ్గారు. ఇటీవలే ఆయన ఎన్డీఏ కూటమిలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా నితీష్‌కు మద్దతుగా నిలవడంతో బలపరీక్షలో విక్టరీ సాధించారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కి 122 సీట్లు ఉండాలి. నితీష్ వర్గం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో సభలో ఉన్న 129 మంది ఎమ్మెల్యేలంతా నితీష్‌కు మద్దతుగా ఓటు వేశారు. దీంతో అవిశ్వాస తీర్మానంలో నితీష్ సర్కార్ సునాయసంగా గట్టెక్కేసింది.

Spread the love